ప్రాగ్దిశ కట్టిన బంగారు రంగు
చీర పొత్తిళ్ళ లో
మయూఖపు మెరుపుల
నవ్వులు చిందిస్తూ
ఉదయించిన రవి బింబము
సువర్ణపుష్పమై శోభిస్తున్నది.
అచ్చెరువున చూస్తున్న ..
ఆ చెరువు
చేష్టలుడిగి నిలిచినది.
పుత్తడి వెలుగులు మొత్తం పాకి
పలకరించినందుకు
పులకరించిపోయింది.
పసిపాపల బోసినవ్వుల పోలిన
సుమ నికుంజముల శ్రేణి
విరిసి మురిసింది.
బండరాతిలో చైతన్యపు శోభ
బంగరు వెలుగులో
అందంగా తోచింది.
మేఘాల భూపాలరాగం తో
జగతి మేల్కొని
కనులారా కర్మసాక్షిని చూసి
మధురానుభూతి పొందింది.
మన మనసులను
మంచి ఆలోచనలతో
ప్రచోదనం చేయ ఆగమించిన
అరుణుడికి భక్తిగా దోసిలొగ్గి
అంజలి ఘటిస్తూ
🌺🌺 సుప్రభాతం 🌺🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి