రోజ్ రోజ్ రోజా పువ్వా ;-ఎం. వి. ఉమాదేవి

ఆట వెలదులు 
మనసు దోచుకున్న మధురమౌ పుష్పము 
మోహనమ్ము గల్గు మోజుపడగ 
రంగుహంగు తామె రమణీయ రోజాలు 
తోటకెంత ఘనత తొంగిచూడ!!

సున్నితమ్ము రేకు సుందర సుకుమారి 
వాడిపోక నుండి వారమైన
లాభమెంత గల్గు లాలన బెంచంగ
తోటమాలి శ్రమకు తూకమి చ్చు !!

కామెంట్‌లు