క్షమ! అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా మనకు ఎవరిపైనో కోపం వస్తుంది అనుకోండి!వెంటనే వారి ని  మాటల ఈటెలతో కుళ్ళబొడుస్తాం లేదా మనసు లోనే తిట్టుకుంటాం! కానీ దీని వల్ల వారి కి  మనకు మానసిక అశాంతి మూతిముక్కు విరుపులు మొదలవుతాయి.గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తగాదా పెరుగుతుంది.అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని.ఒకసారి వర్ధమాన మహావీరుని దగ్గరకు ఓశిష్యుడువచ్చాడు."భంతే! ఇంకో శిష్యుడితో నాకు ఇవాళ పోట్లాట జరిగింది. అప్పటి నుంచి నాకు ఏంటోబాధ దు:ఖంగా ఉంది.  నన్నేమి చేయమంటారు?" దాని కి భగవాన్ ఇలా అన్నాడు "నీవు వెంటనే అతన్ని క్షమాపణ కోరు." "భంతే! అతను నన్ను క్షమించడేమో?" "నీవు నిజమైన సన్యాసివి ఐతే శాంతం సహనం మైత్రితో వ్యవహరించు.వాటినించి దూరంగా పోయేవాడు సన్యాసి కాజాలడు.పాము తన కుబుసాన్ని విడిచినట్లు మనిషి కూడా కోపం అసూయ విడిచేయాలి.యజ్ఞమంటే జంతుబలికాదు.మాటలతో హింసించినా పాపం అంటుతుంది.ఓసారి అడవిలో చెట్లరాపిడి వల్ల అగ్ని పుట్టి అడవంతా కాలుతోంది.ఓముసలి ఏనుగు ఖంగారు గా పరుగులు తీస్తూ  సరోవరం దాటబోయి అందులో ఊబిలో చిక్కుకుంది. ఓగున్న ఏనుగు  వెంటనే దాన్ని బైటకి లాగసాగింది.ఈపెద్ద ఏనుగు  కొద్ది రోజుల క్రితం ఆగున్నని పొడిచి పొడిచి తనగుంపులోంచి వెళ్లగొట్టింది.కానీ ప్రతీకారం చూపకుండా  ఆగున్న ముసలి ఏనుగు ని కాపాడింది.అందుకే  కోపం వచ్చినా తమాయించుకోవాలి.🌹
కామెంట్‌లు