శాపం!(డోగ్రీ కథ ఆధారంగా); -అచ్యుతుని రాజ్యశ్రీ

 కాశ్మీర లోయలో అతనో సామంత రాజు.మహా అహంకారి.ఎప్పుడూ విందువిలాసాల్లో మునిగి తేలుతూమత్తు లో మునిగి పోయేవాడు. కాశ్మీర పండితులు అంతా తమ కష్టసుఖాలు బాధలు చెప్పుకోవాలని రాజు వనంలో వేసుకున్న  గుడారాల దగ్గరకు వస్తే  అక్కడ ఉన్న ద్వారపాలకులు ఛీత్కరించారు."రాజు రాజకీయవిషయాలలో తలమునకలై ఉన్నారు. పో!పోండి".ఇట్టిలుడు అనే వేదపండితుడు  పాపం కాళ్ళ వేళ్ళ పడి బతిమాలాడు. ఆబడుగు విప్రులందరినీ చూసి న్యాయం రాజు ని కలుసుకోవడానికి అనుమతి కోరాడు.భటులు విచక్షణారహితంగా అందరినీ చావచితకబాదారు.పాపం ఇట్టిలుడు  దెబ్బలు తింటూ అక్కడే కూలబడ్డాడు.తాతముత్తాతల కాలంనాటి అగ్రహారంని పొలాన్ని సేద్యం చేస్తూ పిల్లల కి వేదం నేర్పుతున్న ఉచితంగా విద్యబోధిస్తున్న తనపై రాజు  అమానుషంగా దాడిచేయించటంతోపాటు తన ఆస్తి ని పండితుల భూమి పుట్రని కబ్జా చేయటంతో బాధ పడసాగాడు.ఒకప్పుడు ఎంతో మంచి వాడైన ఆరాజు ఇతరరాజుల దుర్బోధ రాణులవిలాసాలతో విచక్షణ కోల్పోయి దురహంకారం తో విర్రవీగుతున్నాడు.చాలా మంది నవార అనే నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.యాగాలు  పూజపునస్కారాలు లేక పురోహితులు కూటికి గతిలేక ప్రాణాలు వదిలారు.అందుకే  అందరికీ పెద్ద వృద్ధుడైన  ఇట్టిలుడు స్వయంగా రాజు ని కలిసిగానీ పోరాదని మొండికేసి పెద్ద పెద్ద గా రంకెలు వేయసాగాడు.
ఆకేకలు వినపడటంతో రాజు  అతన్ని లోపలికి ఈడ్చుకురమ్మన్నాడు.దోసిలి పట్టి నిలుచున్న ఆవృద్ధునివైపు కన్నెత్తి చూడకుండా  మద్యం సేవిస్తూ నాట్యకత్తెపై దృష్టి నిల్పిన రాజు పై నిప్పులు కురిపించాడు"రాజా! పూజాపునస్కారాలతో బతికే మాపొట్టకొట్టవద్దు.""ఏం!నీవేమైనా ఋషివా?నన్ను భస్మం చేస్తావా?"గుడ్లురుమిన రాజు తో"కలియుగ ప్రభావం వల్ల మాతపశ్శక్తి క్షీణించింది.కానీ మాఉసురు తగిలి తీరుతుంది. మాశాపశక్తి త్వర త్వరలో నీకు తెలుస్తుంది." "ఓహో!ఒట్టిగొడ్డుకి అరుపులు మెండు.ఇప్పుడే నీపీక పిసికేయిస్తాను." "రాజా! నీతలకాసేపటిలో పుచ్చకాయలా చెక్కలవుతుంది."అని ఆక్రోసిస్తూ బైటకి వచ్చాడు. కాసేపటికి విపరీతమైన ఈదురు గాలులతో అన్ని గుడారాలు పేకముక్కల్లా నేలరాలాయి.రాజు నెత్తిన కడ్డీ కింద పడి అతని తల భళ్ళు మంది. అతని శరీరం నించి దుర్వాసన రావటంతో  అందరూ అక్కడనించి తప్పు కున్నారు.దిక్కు లేని చావుచచ్చిన రాజు దేశాన్ని ముష్కరమూకలు లూటీచేశారు.మంచి వారి మాటలు వృధాపోవు.వారి బాధ కోపం దుర్మార్గులను దహించుకతప్పదు🌹
కామెంట్‌లు