గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (10);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 ఇంతమంది ఉండగా  ప్రత్యేకించి రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీ కులమనా అన్న వాళ్లు లేకపోలేదు కానీ నేను రెడ్డిని అన్న విషయం వారికి తెలియదు. నేను చెప్పిన తర్వాతనే నా పూర్తి పేరు వారికి తెలిసింది  ఆకాశవాణి లో నా గొంతు విని  ఆకర్షితుడై నన్ను  స్నేహితునిగా ఆహ్వానించారు  వక్తగా వారి  ఉపన్యాసాలు విన్న తర్వాత  ఆకర్షించి వారి స్నేహాన్ని కోరాను. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే  నేను చిన్నప్పుటి నుంచి రేడియోలో  వార్తలు వినడం అలవాటు చేసుకున్నాను మా అన్నయ్య ద్వారా. నేను కూడా రేడియో లో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా సాధన చేసే వాడిని నేను కాలేజీ కి వచ్చిన తర్వాత ఆడిషన్ కి వెళితే నీవు పనికిరావు ఆకాశవాణి అన్నది బ్రాహ్మణుల సొత్తు నీది కాదు  అని పంపించారు. దానితో కసి పెరిగింది  పట్టుదలతో సాహిత్యం మీద కృషి చేశాను. అదృష్టవశాత్తూ ఆకాశవాణిలో పనిచేస్తున్న నండూరి సుబ్బారావు గారు  విజయవాడ మాచవరంలో నేను ఉంటున్న ఇంటి దగ్గర లోనే ఉన్నారు. వారిని చూస్తూ రేడియోని ఊహించుకున్నాను అనుకోకుండా నేను కాలేజీలో నాటకం ప్రదర్శించడానికి  వారి వద్దకు వెళ్లి మా నాటకానికి  దర్శకత్వం వహించాలని అడిగితే ఆయన  అంగీకరించి వచ్చారు. నేను చదువుతున్న ప్రతిది విని ఒక రోజు ఆనందా నీ కంఠం బాగుంది ఆకాశవాణికి పని కొస్తుంది ప్రయత్నం చేయగలవా అంటే అది బ్రాహ్మణులకే సార్ మాకు కాదు అన్నాను నిర్లిప్తంగా వారేమి సమాధానం చెప్పకుండా రెండోరోజు  ఆకాశవాణిలో నాటకానికి సంబంధించిన ఆడిషన్ ఫామ్ తీసుకు వచ్చి నన్ను ఏకాంతంగా కూర్చోబెట్టి నీ పేరు చివర రెడ్డి తీసివేస్తే నీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. రేడియోలో మాట్లాడటం కన్నా నాకు వేరే ఆలోచన లేదు సార్  మీరు ఎలా చెబితే అలాగే వింటాను అన్నాను అలా నా పేరు ఏ బి ఆనంద్ అయింది. ఇక శివ నాగ రెడ్డి గారి విషయంలో  వారి జీవితంలో స్థపతిగా   రాణించడం వారి జీవిత  ఆశయం తన చదువు పూర్తయిన తర్వాత  శిల్పకళలో ఎవరు ప్రసిద్ధులో వారి వద్దకు వెళ్లి తనకు విద్య నేర్పమని వినయంగా అడిగితే వారి పేరు చెప్పగానే ఇది శూద్రులకు వంట బట్టే విద్య కాదు బ్రాహ్మణుడు తప్ప మరొకరు దీనికి పనికి రారు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆ తర్వాత తనకు తెలిసిన అనేక మంది ద్వారా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆలోచనలో పడి వారు చెబితేనే విద్య వస్తుందా   శిల్పాలను చూసి మనం నేర్చుకోవాలి అనే నిర్ణయం తీసుకొని స్వయం కృషి తో ప్రారంభించారు. ఇక నీవు రేడియోకు పనికిరావు  అన్నప్పుడు నేను ఎంత కృషి చేసి ఎవరు నన్ను తిరస్కరించారో వారికి చెప్పే స్థితికి వచ్చానో  మీ వల్ల కాదు సుత్తి పట్టుకోవడం కూడా తెలియదు  నీవు శిల్పాలు చెక్కడం ఏమిటి అని ఎద్దెవా  చేసిన వారంతా  నిన్ను మించిన వారు మరొకరు లేరు  ప్రస్తుత కాలంలో అని బందా గారు నన్ను అభినందించినట్లు గానే  రెడ్డిగారిని తిరస్కరించిన స్థపతులు అందరూ  ఏకకంఠంతో పలికిన మాటలు  మా సరసన నిలబడడానికి  నీవు అర్హుడవే అని. అందుకోసం వారి గురించి చెప్పాను తప్ప మత అభిమానము, కుల అభిమానము కాదని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను.


కామెంట్‌లు