గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (11)-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.


 మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసే మనిషికి  మట్టిని గురించిన విషయాలు తెలియ లేదంటే నాకు నవ్వు వస్తోంది. అందుకే  వినాయకుడిని భగవంతునిగా చేసి మట్టితో తయారు చేసిన ఆ బొమ్మకు  నైవేద్యం పెట్టి పూజించి మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ మట్టిలోనే కలిపివేస్తారు. దీనికి  మనిషిని సమన్వయ పరిస్తే పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో వుండవలసి వచ్చినా దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కదా ఈ పండుగ విశేషం అని చక్కటి అర్థవంతమైన వ్యాఖ్య చేశారు మా శివనాగిరెడ్డి గారు.  ఈ భూమి మీద ఏ పంటలు పండుతాయి,  ఏ లతలు పూలు పండ్లు చెట్ల ఆకులు  వీటి గురించిన  అవగాహన చేయడం కోసం బాల్యంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది  అన్న అభిప్రాయంతో  అమ్మ పిల్లలకు తలంటి పోసి మంగళ స్నానం చేయించి,  ప్రతి భాగాన్ని శుభ్రం చేయడం వల్ల కుర్రవాడికి  స్నానం చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుస్తాయి.

తరువాత తన వానర సైన్యం తో  బయలుదేరి చెట్టు పుట్ట వెతుకుతూ కాలవ ప్రక్క  అనేక రకాల ఆకులను పూలను సేకరించి వాటిని ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రం చేసి  

దానిని పవిత్రంగా భావించే  మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని శుద్ధిచేసి  విగ్రహాన్ని ప్రతిష్టించి దాని చుట్టూ కూడా ముగ్గు వేసి పద్మాసనం వేసుకుని కూర్చుని అమ్మ నాన్న అక్క చెల్లి అందరితో కలిసి వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనివల్ల పద్మాసనం వేసుకొని కూర్చోవడం అలవాటవుతుంది  పిల్లలతో ఆకుల సేకరణ కోసం వెళ్ళినప్పుడు స్నేహబంధం పటిష్టం అవుతుంది  ఇక్కడ పూజ లో కూర్చున్నప్పుడు కుటుంబ సభ్యులతో  కలయిక ప్రేమ ఆప్యాయతలు అంటే ఎలా ఉంటాయో అర్థమవుతుంది. గణపతి పూజ అయిపోయిన తర్వాత  గృహస్తు కానీ  వారి పెద్ద కుమారుడు కానీ కుమార్తె కానీ  ఒక్కొక్క ఆకును అలా అని చూపిస్తూ  ప్రకృతి మనకు ఇచ్చిన బిక్ష కనుక ప్రకృతి ఇచ్చిన ప్రతి వస్తువును ప్రకృతికి సమర్పిస్తున్నాము  అని దాని విశేషాలు తెలియజేయడంతో  పిల్లలకు భౌతిక విషయాలు కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవతార లక్షణాలు కూడా అతి చిన్న జంతువు ఎలుక నుంచి అతి పెద్ద జంతువు ఏనుగు  వరకు ఉన్న ప్రతి లక్షణం  వివరంగా పిల్లలు పెద్దల నుంచి నేర్చుకోవడం సామాజిక ప్రయోజనం  వంటలు కూడా ఆవిరితో చేసిన కుడుములు, ఉండ్రాళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతి వైద్యులు మనకు చెబుతారు  ఇన్ని ప్రయోజనాలతో కూడిన  పండుగ ప్రత్యేకించి హిందువులు చేసే ప్రతి పండుగకు శాస్త్రీయ దృక్పథంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ఉండి తీరుతుంది. ఎంతమంది మేధావుల కలయికతో ఏర్పడిందో ఈ పండుగల సందర్భంగా అవన్నీ తెలుసుకుంటే  మన కన్నా మన పెద్దలు ఎంతో ముందు చూపుతో జీవించారని అర్థమవుతుంది అంటారు మన మేధావి శివనాగిరెడ్డి.


కామెంట్‌లు