"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 84,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 మందారానికి సింగారం నేర్పాలా అన్నట్టు
సహజ సౌందర్యంతో వుట్టిపడే కుసుమ ను
డ్రైవింగ్ సీటులోంచి తొంగి చూసే రాహుల్ ను
నన్ను చూడటం ఆపి ముందు చూసి నడపండి
అని అన్నది కుసుమ............!!
చూస్తూనే నడుపుతున్నా మనలాగే ఈరోడ్డు కూడా
ఎంత నిర్మానుష్యంగా ఉంది అంటూ కారు ను
కాస్త పక్కకి ఆపి కుసుమ తో కబుర్లాడటం
మొదలు పెట్టాడు రాహుల్............!!
కుసుమ రాహుల్ తో పాటు హాస్పిటల్ కు వెళ్ళి
రాహుల్ వాళ్ళ నాన్న గారిని పలకరించి గీతా
వాళ్ళు అమ్మగారి ఇంటికి వెళ్ళింది... రాహుల్
రేపు మనిద్దరం నాకారులో వెళ్దాము ఈరోజు
వుండు అనగానే డ్రైవర్ తో తన కారు పంపేసింది.!!
మర్నాడు టిఫిన్ చేసి రాహుల్ కారు లో 
బయలు దేరారు, కుసుమా రాహల్, చెప్పు
కుసుమా, మళ్ళీ ఇంటికి వెళితే మనస్పూర్తిగా
మాట్లాడు కోలేము ,అని అన్నాడు రాహుల్......!!
ఎంతయినా ఇద్దరూ దండలు మార్చుకున్న
అప్పటి నుండి రాహుల్ పై ఏదో తెలియని
మోహం కుసుమను వెంటాడుతోంది......
కుసుమ పై చెప్పలేని ప్రేమ పెరిగింది రాహుల్ కు...
మనసులు పెనవేసుకున్న రాగబంధంలో...
ప్రేమ ప్రణయ ప్రయాణం ఒంటరిగా వున్న ఇద్దరకీ
సమయం, సానుకూలమైనా, మౌనం, మోస్తోంది
భారంగా...చెట్లు లయబద్దంగా, తలలూపగా
పూవులు, తమ సుగంధాలు,పరిమళాలను
పంపగా, గాలి వినీలమై, వీస్తుంటే, పరవశించిన
ప్రకృతి చిరునవ్వులు విసిరింది.........!!
మనసులు గతులు మార్చాయి ఆహ్లాదకరమైన
వాతావరణంలో అలా ఒకరిని ఒకరు రెప్పలార్చక
చూపుల్లో ప్రేమ పరవళ్ళు పొంగగా కుసుమా అని
పిలిచాడు రాహుల్ ఏమిటి, అన్నట్టు, ముఖంలో
బావాలు నింపింది, కుసుమ (సశేషం)........!!

కామెంట్‌లు