"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 85,వ బాగం)- "నాగమణి రావులపాటి "
 చెప్పు రాహుల్ పిలిచి అలా మౌనంగా వుంటే ఎలా అని అన్నది కుసుమ..నీతో ఏదో మాట్లాడాలని ఎంతో
చెప్పాలని వున్నా అదేంటో నిన్ను చూస్తే నేను
మూగవాడిగా మారిపోతా, ఏంమాయచేసావే......!!
ఔనా కవితలతో అలరించే మీకు మాటలు కరువా
నాతో మాట్లాడించాలని  కాకపోతే అని అన్నది
కుసుమ, చిలిపిగా చూస్తూ...మీరు దొరసానిగారాయె
మీతో మాట్లాడాలంటే మాటలు వెతకాలి మరి, అని
అన్నాడు రాహుల్ అంతే చిలిపిగా.........!!
చల్లగాలి పరవళ్లకు ముంగురులు నుదుటిపై నాట్యం
చేయగా కాటుక కన్నుల కవ్వింతలతో పెదవులు
కెంపుల రంగుతో చమ్మగిల్లి మెరుపులు అద్దగా
మనసు రాహుల్ పై లగ్నం చేసి చూపులను
ప్రకృతిపై నిలిపి చూసే కుసుమను ప్రేమ నిండిన
హృదయంతో తనివితీరా చూస్తున్న రాహుల్ ను
తలతిప్పి చూసింది కుసుమ........!!
తన ఊహల రారాజు చూపులకు, హృదయంలో
కోటి వీణలు మీటగా పులకింతల గిలిగింతలతో
పారవశ్యం పట్టుతప్పి రాహుల్ ఒడిలో 
వాలిపోయింది కుసుమ...అంతే ఆత్రం ఆవరించి
తన అనురాగం దేవతపై  ఆరాధనగా చేయివేసి
తన ప్రేమ హస్తంతో సుతారంగా తల నిమురుతూ
ఆనందం బాష్పాలతో, కుసుమకు, అభిషేకం
చేసాడు రాహుల్............!!
ఆ నీటి ముత్యాలలో తడిసిన మనసు ఊరట 
చెందిందో ఏమో సొమ్మసిల్లి అలానే వుండిపోయింది
కుసుమ..‌కుసుమా ఏ జన్మలో నేను పుణ్యం
చేసుకున్నానో నీలాంటి ప్రియురాలిని కానుకగా
పొందాను.. ఈ పరవశం నా వశమైంది.......!!
అని ఉద్వేగంతో పలికే మాటలకు, లేదు రాహుల్
ఆ భాగ్యం నాదే...నీవు నాకు లభించటం ఎన్నో
జన్మలో పుణ్యఫలం... అందుకే నాకోసం నీవు
చూసే ఎదురు చూపుల నిరీక్షణే చెపుతుంది....
నీవు పడే వేదనా ఆవేదనా నీ త్యాగ గుణం
ఎవరికీ సాధ్యం కాదు అంటూ ఇంకా గువ్వలా
ఒదిగిపోయింది కుసుమ..........!!!
కాలం ఇలా ఆగిపోతే బాగుండు నీ వియోగం
నాకు నిదురలేని ఒంటరిని చేస్తోంది.....
నీ రాక కోసం చంద్రుని పున్నమి వెన్నెల వెలుగుకోసం
ఎదురు చూసే చకోరంలా నామనసు నీకోసం
తీయగా ఎదురు చూస్తోంది ప్రియసఖీ......!!
అనంతమైన విశ్వంలో అణువంత ప్రేమ
విశ్వానికే అంతు చిక్కని ప్రణయకావ్యం మనది...
నీ రాక నాఎద వాకిటిలో మంగళ తోరణమై
నిన్ను ఆహ్వానిస్తోంది సఖీ... ఆగలేని తాపమేదో
అంతు చిక్కని భావాలతో మనసు మోహం
మాటున దాగి ముసుగేసి, కట్టుబడిన, నీ మాటను
దాటనీయటల్లేదు............!!
త్వరగా తెరతీసి నన్నల్లుకునే రోజుల కోసం
ఎదురు చూసే నన్ను ఆదుకుని చేరదీయవా
నా అందాలు సుమ కుసుమమా నీ పరిమళ
ఆగ్రూణిమలలో మైమరచిపోనీ ఇక ఆగలేని
నీ ప్రియుని ఆవేదనా నివాళి వినుమా కుసుమా
అంటూ రాహుల్ కొంచెం ఎమోషనల్ కు
గురికావటం గమనించిన కుసుమ (సశేషం).......!!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం