ఎన్టీ రామారావు గారు దేవిక తో జెమినీ వారి సినిమా శతదినోత్సవ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో హేమాహేమీలంతా పాల్గొన్నారు. ఆకాశవాణి నుంచి ప్రయాగ నరసింహశాస్త్రి జెమినీ స్టూడియో నుంచి వాసన్ ఏ వి ఎం నుంచి మెయ్యప్పన్ హాజరయ్యారు. రామారావు గారు, దేవిక గారు వచ్చారు. రామారావు గారి కార్యక్రమం విజయవాడలో జరిగిన ఏ కార్యక్రమానికైనా విశ్వనాధవారు ఉండి తీరవలసినదే అధ్యక్ష స్థానంలో. వారికి ఎన్.టి రామారావు గారు పాద నమస్కారం చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం అందరి ప్రసంగాలు అయిపోయాయి విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రారంభిస్తూ నేనెప్పుడూ సినిమాలు చూసిన పాపాన పోలేదు చూడాలని కూడా అ నిపించదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మా మనవరాలు తాతయ్య మీ శిష్యుని సినిమా వచ్చింది చాలా బాగుందిచూద్దాం అంది. దాని గోల భరించలేక వచ్చి ఈ సినిమా చూశాను సినిమా మధ్యలో వెళ్ళిపోదామని అంటే ఆగండి తాతయ్య దీనిలో కుక్క చాలా బాగా చేసింది అంటే తప్పక చివరివరకు ఉన్నాను. ఈ సినిమా చూసిన తర్వాత దానిలో ఒక చిన్న విషయం కథానాయిక ఆమె కట్టు, బొట్టు, జుట్టు మన అర్ష సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంది ఆంధ్ర దేశంలో ప్రతి ఆడపిల్ల ఆమెను అనుసరించి తీరవలసినదే ఆ అమ్మాయి వస్తుందేమో చూసి అభినందించి ఆశీర్వదిద్దాం అన్న అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి అంగీకరించి వచ్చాను అన్నారు. తీరా చూస్తే ఆమె వచ్చిన జాడ కనిపించడం లేదు నేను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాను కానీ కాలేదు. అన్న వెంటనే రామారావు గారు మీ పక్కన ఉన్నది దేవిక ఆమే కథానాయిక అని పరిచయం చేశారు." ఏరా నాతోనే అనృత భషణములా ఎంత ధైర్యం రా ఆమె ఎక్కడ? ఈవిడ ఎక్కడ? హస్తి మసి కాంతర భేదమున్నది ఆమె సంప్రదాయానికి ప్రతీక ఈమె ఈ చీర కట్టడం ఏమిటి ఆ వక్షోజ ప్రదర్శన దేనికి ఆ జుట్టు ఏమిటి రా గుర్రపు తోకలాగా అలా బయటకు వాలింది ఎక్కడో బాగా ఎండలో పెట్టుకోవలసిన ఆ నల్ల కళ్ళజోడు ఇక్కడ దేనికి రా ఈమెను చూసి కథానాయిక అనుకోమంటావా అని ఎంతో ఎద్దేవా చేశారు. దానితో రామారావు గారు దేవికతో క్షమాపణ చెప్పించి ఇంకెప్పుడూ ఇలా రానని చెప్పి పాదాభివందనం చేసింది. ఆ సాయంత్రం లైన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమానికి పట్టు చీర కట్టుకొని ఆంధ్రుల ఆడపడుచుగా వచ్చింది. దానికి విశ్వనాథ వారు కూడా హాజరయ్యారు వారిని చూడగానే పాదాభివందనం చేసి ఆశీస్సులు అడిగింది. ఇలా ఉండాలమ్మా బంగారు బొమ్మలా ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తున్నావో అదే ఉదయం ఉన్న వేషనికి ఆవేషంలో నిన్ను కొరుక్కుతిందామా అన్న చూపులు తప్ప, ఇక్కడ వీరు చూసే ఆరాధనాభావం అర్థం అయ్యిందా నీకు. నాకు తెలియక కాదు నీవు దేవికవు అని నిన్ను హెచ్చరించడం కోసమే అలా మాట్లాడవలసి వచ్చింది. పెద్దవాడిగా నాకు అధికారం ఉందని నేను చొరవ తీసుకుని చెప్పాను. ఏమి అనుకోకు అని బుజ్జగించారు. "ఉత్తమస్య కోపం క్షణం" అన్న ఆర్యోక్తికి విశ్వనాధ వారు గొప్ప ఉదాహరణ.వారికి పాదాభివందనం.
కవిసమ్రాట్ విశ్వనాథ వారు (2);-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి