జీవితంలో ఎంతో మంచి పేరు గడించిన ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ సన్మానించాలన్నా ఆయన అంగీకరించరు. పనిచేసే వారిని సత్కరించండి ఇంకొంచెం బాగా పని చేస్తారని సలహాలు మాత్రం ఇస్తారు. నిజానికి భారత దేశ ప్రథమ పౌరుని నుంచి వారి గ్రామంలో ఉన్న వారి పనిమనిషితో సహా ఆత్మీయతను, గౌరవమర్యాదలను పంచుకునే వ్యక్తి. వారి సంస్థ ద్వారా ఏ కొంచెం ప్రతిభ కనపరిచిన వారినైనా తీసుకువచ్చి తన ఆఫీసులో తన సాహితీ మిత్రులతో కలిసి వారిని గౌరవించడం, సత్కరించడం వీరు చేసే మంచి పనులలో ఒకటి. ఎంతమంది చదువరుల పొగడ్తలు పొందినా దానికి మరింత స్ఫూర్తి చెంది ఇంకా ఎక్కువ కృషి చేస్తాడు అనేది వారి నమ్మకం ఇంతవరకు ఎవ్వరు వీరు నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అది వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. అంత నిరాడంబర జీవి మా మిత్రుడు.
ఆయన జీవితంలో హృదయపూర్వకంగా గొప్ప కవిగా పేరు గాంచిన దువ్వూరి రామిరెడ్డి గారు వేమన తరువాత వీరికి ఆరాధ్యం. అలాగే తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన, ఎందరి ఆకలినో తీర్చిన పునకాల కనకమ్మ గారంటే అమితమైన ఆరాధన. నెల్లూరులో ఒక సంస్థ వారు పునకాల కనకమ్మ గారిది, దువ్వూరి రామిరెడ్డి గారిది కలిపి ఒక బహుమతిని ప్రకటించింది. దానికి అర్హత కలిగిన వ్యక్తి మా శివనాగిరెడ్డి గారని భావించి వారిని అడిగినప్పుడు నా కన్నా బాగా నచ్చిన వాడు వుంటే వారికి ముందు సన్మానం చేయండి తర్వాత నాకు చేయవచ్చు అన్న తర్వాత, ముందు మీకు చేసిన తర్వాతనే ఎవరికైనా చేస్తాం అని పట్టుపట్టిన తర్వాత తప్పని పరిస్థితులలో అంగీకరించారు. దానికి అధ్యక్షుడిగా వచ్చినవారు మాజీ కేంద్ర మంత్రులు మాజీ గవర్నర్
దత్తాత్రేయ గారు. హైదరాబాదులో మొదటి నుంచీ నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి. నేటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి యువకులను ప్రోత్సహించి ప్రజా సేవలు అందించిన వ్యక్తి. అనేక సేవా కార్యక్రమాలలో భాగస్వామి. అలాంటి వారి చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం వారికి తగిన గౌరవం. దానితోపాటు వారు రాసిన చారిత్రక అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో కొన్ని వేల మంది సమక్షంలో జరిగిన సభలో ఈ సత్కారం జరగడం వారి అభిమానులందరికీ పండగ రోజు. ఆ సందర్భంగా దత్తాత్రేయుల వారి హస్తముల మీదుగా బహుమతిని అందుకుంటున్న చిరు దరహాసి మా శివనాగిరెడ్డి గారి ఛాయాచిత్రాన్ని మీకందిస్తున్నాను.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (7)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం, 9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి