త్రివర్ణ సందేశం(నానీలు );-పి. చైతన్య భారతి -7013264464
 1.
రహస్య ఆరాధనేదో 
నాలో గూడుకట్టె. 
ప్రేమజ్యోతికై 
అక్షరార్చనతో. 
2. 
నీ పెదవుల తళుకుల్లో 
నే చిరునవ్వై 
మెరవాలి. 
వలపువీణ యిది. 
3. 
చూడలేని లోకాలెన్నో 
నే చూస్తిని. 
నీ చేరువలో... 
ఊహా మధురమే యిది. 
4. 
వీరుల 
ఉక్కుపాదానికి 
బ్రిటన్ సామ్రాజ్యవాదం 
పేకమేడలయింది. 
5.
చెవినిల్లు కట్టుకుంది 
అంకితమవ్వంటూ 
దేశసేవకు 
త్రివర్ణ సందేశం. 


కామెంట్‌లు