పద్యాలు ; జక్కల శివ ఇంటర్మీడియట్-7093225602
 ఆట వెలది
 ధనము సర్వముగను ధర్మముగా నేడు
 తలచుచుండ్రి జనులు ధరణిలోన 
 పుట్టినపుడు రాలె పోవునపు డు రాదు
 తెలియకుండ్రి నరులు తెలివి మీరి
 తేటగీతి 
  హితము నుద్బోధ గావించు మతము కులము 
 జాతి భేదముల్ లేకుండ జనులు యెల్ల
 కలుపుగోలుగా నిత్యము కలిసి యుండ
 మతము పేరిట హత్యలౌ? మహిని యందు
తేటగీతి
 రంగు రంగుల ముగ్గులు రమ్యముగను
 వనితలంతయు వేసిరి వాకిటoదు  
 పరవశించెను హృదయాలు పబ్బముతొను
 సంకురాతిరి తెచ్చెను సంబరములు
ఆట వెలది
 అన్ని వేల లందు అణిగిమణిగి యున్న
 గౌరవమ్ము గలుగు నిరతముగను 
 వినయ గుణము వలనె విరళ ఘనత గల్గు
 విశ్వ సుజన వాణి వినుడి చెబుత

తేటగీతి 
 కటువుగా మాటలాడకు ,  కఠిన తనము 
 కాలుచును నిన్ను నిప్పుల, గాయపరచు
 హృదయముల్  నిక నైనను మధురముగను
 మాటలాడము నిత్యము మదిని దోచ

కందం 
 చెడు మార్గంబున బోవకు 
 తడబాటుల్ లేక జనులు ధైర్యముతోనీ!
 వడి వడిగా సాధనచే
యుడి లక్ష్యంబులను చేర  యుత్సాహముగన్



కామెంట్‌లు