తెలుగు తల్లి;-యలమర్తి అనూరాధ--హైద్రాబాద్--చరవాణి:924726౦206
భాష బంగారు కళ్ళ ఒడిలో
ముద్దులొలుకుతూ మురిపిస్తుంటే 
అమ్మ ఒళ్ళో మైమరిచిన అనుభూతి
పలుకు ముత్యమై అక్షరాల హారంగా 
పొదిగి ఒదిగి అలరిస్తుంటే 
అరుదైన అందాన్ని అందుకున్నంత ఆనందం
పాట పల్లవై గాలి చిరుగాలిలా 
హృదయాన్ని సుతిమెత్తగా మీటుతుంటే 
అలవికాని సంతోష తరంగం ఉప్పెనై ఉరికేను 
మధురత నిండిన మమకారమా 
నిను వీడను ఏనాడూ 
కడదాకా నీతోనే సహవాసం

(తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలతో)


కామెంట్‌లు