గోదావరి కరుణానిధి;-"రసస్రవంతి " & " కావ్యసుధ " చరవాణి : 9247313488.
గోమాత జీవితములో
ఉద్ధరించనెంచి
ఆవిర్భవించింది గోదావరి
గౌతమ్ ని గో హత్య
పాపాన్ని హరించి
గౌతమీగ వర్ధిల్లు కల్మషహరి
కదలి వస్తోన్నది గోదావరి
కారుణ్య వాహినిగా ఝరి

కులుకు లొలికేతనువు
వడి వడిగా చెరియింప
కాళ్ల గజ్జల ధ్వనులు
గల గలా రవళింప
ఎత్తు పల్లాలపై
సమముగా ప్రవహింప
తలలెత్తు అలలుగని
జనం సంతోషింప
నరులను
పునీతులుగా చేయాలని
తరలివచ్చే తల్లి
కరుణానిధి.

మానసమ్మున మత్తు
మరులావలింపగా
హృదయాంతరంగాన
ఉత్సాహముప్పోoగా
చిరునవ్వులో ఆణి - 
ముత్యమ్ములొలుకగా                        
ఓర చూపుల ప్రేమ
ఝరులుద్భవింపగా
కదలి ముందుకు సాగు - గోదావరి
కడలి కౌగిళి చేరుకోవాలని..


కామెంట్‌లు