భక్తి మార్గాలు;-మమత ఐలకరీంనగర్9247593432
న్యస్తాక్షరి:-
పలక,పడక‌,పరక, పసక రెండవ అక్షరాలుగా..
తేటగీతులు...

జపము తపములెన్నొ మతముజాడ దెల్ప
ఫలము నాశించిరా గొల్లభామలపుడు
సుకవియైనభక్త కబీరు సుగళమంత
తపనతో నిల్పెనే స్వామి దయను గోరి

నడక నేర్వక ముందుగన్ నరహరనుచు
నికరముగ నమ్మి కొలిచెనే నిన్ను దేవ
సుపరిచితమైన నీనామ శోభనెపుడు
మరవలేనట్టి ప్రహ్లాద పరమభక్తి

సకలజనులెల్ల వృక్షపు శాఖలల్లె
తపన చెందేరు పరమాత్మ దారినెంచి
పసక,పండ్లైన పుష్పాలు  పత్రమైన
సకలమాచెట్టు సంపదై సాగు విధము
*దారులెన్నెన్నొ యైనను దైవమొకటె*


కామెంట్‌లు