నాలుక;-మమత ఐలకరీంనగర్9247593432

తే.గీతులు

నరులకున్నది నొకటేను నాల్కగాని
పలుకు పరిపరి విధములన్ సులువు గాను
లోపములతోడ చెప్పేను పాపమల్లె
యెట్లు బ్రతికినన్ దోషాల యీసడింపె

మౌనముగ నున్న నల్లియన్ మాటలండ్రు
వదరు బోతండ్రు ఘనముగన్ పలుకనెపుడు
బిగువుతో నుండ నెప్పుడు బింకమండ్రు
యెట్లు వేగుడో యీనాల్క చుట్లుజూడఁ


కామెంట్‌లు