గణపతి;-మమత ఐలకరీంనగర్9247593432
 
క.
గణములకధిపతిజేయగ
గణనాథుడివైతివయ్య  గజముఖవదనా!   
గుణగణములు జగతికొసగ
గణపతివై భువికి దిగుము గౌరీతనయా!
క.
మూషిక వాహన దయగని
పోషించుము సుగుణములను మోదక ప్రియుడా!  
దోషమ్ముల లెక్కించక
వేషాలను మార్చవయ్య విఘ్నేశ్వరుడా

కామెంట్‌లు