బాల పంచ పదులు
==============
1. అలిగిన ఆ పిల్లలు !
అందాలరామచిలకలు !
వారి ముద్దొచ్చే పలుకులు!
హాయినిచ్చే చల్లని చినుకులు! అలక అందాల,మొలక,రామా!
2. చిన్ని కృష్ణుని అలక!
ఆనందానికి ఏలిక!
పరవశం ప్రతి గోపిక!
మాటలు కరవు మనకిక!
అలక అందాల,మొలక రామా!
3. హరి, బుంగమూతి,
బొల్లిఏడుపులు!
యశోద ఒళ్లంతా,
ఏమా పులకలు !
రేపల్లె అంతా,
హాస వీచికలు !
చూడాలని,
పదేపదే కోరికలు !
అలక అందాల,మొలక,రామా!
4. అలక,
అందానికి అలంకారం!
సత్యభామ,
అలంకార అవతారం!
మెచ్చింది ,
సంపూర్ణ అవతారం!
ఇచ్చింది,
బహుమాన పారిజాతం!
అలక అందాల,మొలక,రామా !
5. అప్పుడప్పుడే,
అందం అలక!
అందరికీ ,
అదో గొప్ప వేడుక!
కారాదు,
అది నిత్యం వాడుక!
అవరాదు,
మంకుతన పీఠిక!
అలక అందాల,మొలక రామా!
_________
అలకలు, ఆనందాల మొలకలు!;-దా పి వి ఎల్ సుబ్బారావు,9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి