సరి నాయక కేసరి!;-డా. పి. వి. ఎల్ సుబ్బారావు9441058797
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారి జయంతి శుభాకాంక్షలతో
==========================================
1. ఇంటి పేరు టంగుటూరి,       పోరాటం ఆయన ఊపిరి!
భారతస్వాతంత్ర్య పోరాటాన దివ్య ప్రభావం , నవ్య ప్రకాశం!
 సర్వస్వం త్యజించిన, భరతమాత ముద్దుబిడ్డడు! స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటిముఖ్యమంత్రి అతడు!
ఆ పేరు తలచిన చాలు, ధన్యము మన జీవితాలు!

2. తల్లి భోజనశాల నడిపి కుటుంబాన్ని నడిపించింది!
ఆయనఇళ్లల్లో వారాలుచేసి,
 దారిద్యాన్ని ఎదిరించాడు! నాటకాలువేశాడు,
ఆటల్లోచురుకుగా మెలిగాడు!
మెట్రిక్,ఎఫ్.ఏ, న్యాయశాస్త్రం,
     చక్కగా అభ్యసించాడు!
న్యాయవాదవృత్తి చేపట్టాడు,
అమితసంపద ఆర్జించాడు!

3. ముప్పదిఐదవఏట, రాజమండ్రి,
           పురపాలక అధ్యక్షుడు!
ఇంగ్లాండ్ వెళ్లిదీక్షగాచదివి, బారిష్ఠరై తిరిగివచ్చాడు !
వెళ్లేముందు గాంధీగారిలా, 
తల్లిముందు ప్రతినచేసాడు!
బారిష్ఠరుగా ప్రతికేసు గెలిచి,
         వెలుగువెలిగాడు!
బిపిన్ చంద్రపాల్ ప్రభావం ,
సత్యాగ్రహపత్రాన సంతకం!

4. స్వాతంత్రోద్యమాన అడుగు,
  వృత్తికిఇక  వెనుకడుగు!
  అప్పటికిఆదాయం లక్షల్లో, అదివినియోగం దేశసేవలో!
సైమన్ కమిషన్ వ్యతిరేకత, వినిపించింది ఓ సింహగర్జన!
"కాల్చండీరా "అని అరిచాడు, గుండుకు గుండె ఎదురన్నాడు! 
ఆంధ్రకేసరి గా కీర్తించారు, ఆంధ్రకేసరికి సరికేసరి లేదన్నా!

5. ప్రకాశంబ్యారేజ్ ,ప్రకాశంజిల్లా
ఆంధ్రకేసరి  చిత్రం,
      వారిస్మృతులు!
ఆత్మకథ నా జీవిత యాత్ర రాజకీయాలకు ఓ సచ్చరిత్ర!
"గాలితోనైనా పోట్లాడే, స్వభావంప్రకాశం"అయ్యదేవర!
'ప్రమాదం ఉన్నచోటే ప్రకాశం, 
ఉంటారు" భోగరాజు!
నిజాయితీ నిలువెత్తుసంతకం, ప్రకాశంఅన్నది జాతినమ్మకం
________


కామెంట్‌లు