గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి
తెలుగుభాషా దినోత్సవం
ఆగస్టు,29 శుభాకాంక్షలు అందిస్తూ,
========================
1. తెలుగులో ,
ముందడుగు వేయాలి!
గిడుగుకు ,
జన్మదిన కానుకగా ఇవ్వాలి!
వ్యవహారికభాషా ఉద్యమం,
ఉధృతం చేయాలి!
భాషావ్యాప్తికి మన వంతు, పోరాటం నిరంతరం జరగాలి!
2. అమ్మపాలు తాగనివాడు!
అమ్మమాట పలకని వాడు!
అమ్మని మరిచిన వాడు!
అమ్మదేశం విడిచిన వాడు! కొండంతవాడైనా ,
కొరగాని వాడే!
3. పర భాషలు ,
నేర్వద్దని ఎవరన్నారు!
స్వభాష ,
మరవద్దని అందరికీ హెచ్చరిక!
భావవ్యక్తీకరణకు,
మాతృభాషే వెన్నెముక!
మాతృభాషాధికారం,
జ్ఞానానికి సింహద్వారం!
అన్యభాషల ,
అవగాహనకి ప్రవేశద్వారం!
4. భాషా సంస్కృతులు,
మన జీవం!
వాటి తోటే,
మనుగడ సార్ధకం!
భాషల పరిరక్షణ,
నేడు ప్రపంచ సమస్య!
భాషతోనే బతుకు,
లేకుంటే చితుకు!
గ్రహించిన ,
యునెస్కో ఫిబ్రవరి 21!
ప్రపంచ మాతృభాష, దినోత్సవం అని ప్రకటించింది!
5. విశ్వననరులమంతా,
ఒకటవుదాం!
మాతృభాషలను,
కాపాడుకుందాం!
భాష అంటే ,
వాడుకలో ఉండాలి!
లేకుంటే,
భాష మరణించినట్లే!
భాష మరణించిందా,
మనది మూగ బతుకే!
6. మనమంతా తెలుగు,
నిత్యం వినాలి!
ఇంటా బయటా,
తెలుగే అనాలి!
బాల్యం నుండి,
తెలుగు స్పష్టంగా చదవాలి!
సృజనాత్మకంగా,
తెలుగులో రాస్తూ ఉండాలి!
తెలుగుభాష,
అమృతమవ్వాలి!
7. పరాయి పాలన పోయింది!
పరాయి భాష పాలన ,
మరి పోయిందా!
అమ్మ మమ్మీ అయ్యింది,
తెలుగు డమ్మీగా ఉంది!
అమ్మ శవమా ?
మన జీవన జీవం!
తెలుగు డమ్మీ ఏమి కాదు!
తెలుగు,
మన జీవన సర్వస్వం!
తెలుగు మాతృభాష, కావడం పూర్వజన్మ సుకృతం!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి