ఆత్మయందే పరమాత్మ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం, 9492811322.
 దేవుడు జీవుడు ఈ ప్రపంచం మొత్తం ఈ రెండు శబ్దాల మీదే తిరుగుతూ ఉంటుంది  ఉన్నాడా లేదా అన్న విషయం  ఎవరికీ తెలియదు కానీ దాని కోసం కొట్టుకోవడం మాత్రం  అందరికీ తెలుసు. సర్వాంతర్యామి భగవత్ స్వరూపం అని అనుకున్నప్పుడు ప్రతి అణువులోనూ ఆయన ఉన్నాడు అని నీకు తెలిస్తే ఈ కార్పణ్యాలు ద్వేషాలు ఉంటాయా? ఇలా చేసిన వారిని, చేస్తున్నవారిని అమాయకుడు అనాలా?  అజ్ఞానులు అనాలా?  జీవితంలో చాలా మంది వ్యక్తులు  హిందువులు తిరుపతి అని, జెరూసలం క్రైస్తవులు అని, ముస్లిములు మక్కా అని భగవత్ స్వరూపాన్ని చూడడానికి ఆ ప్రాంతాలకు వెళతారు. నీవు నేను కాదే నీరజాక్ష అన్నట్లుగా  తన జీవిలోనే పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోలేక ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు.  ఎక్కడ తిరిగినా ఆత్మశక్తి లేనివాడికి ఏమిటి కనిపిస్తోంది  ఎవరు ఎవరినీ వద్దని చెప్పరు  ఆ అవసరము వారికి ఉండదు  ఎవరి నమ్మకాన్ని వారు నమ్మి దానినే పాటిస్తారు. ఇతరులు ఎవరు చెప్పినా దానిని  అనుసరించరు ఇది మానవ నైజం. వేమన యోగి వ్రాసిన ప్రతి పద్యం ప్రజల నాలుకల మీద నడయాడుతున్నది అంటే కారణం సామాన్యునికి అర్ధమయ్యే పద్దతిలో వేదాంతపరంగా చెప్పిన  యోగిపుంగవుడు కనుక. పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి లాంటివి గుర్తించని పరమాత్మను తానే తనని చూసుకోవాలి అన్న దానిని  గాడిద మోసే గంధపు చెక్కలతో పోల్చుతూ ఎంతో గొప్పగా చెప్పాడు. వారి మేధస్సుకు  శతకోటి వందనాలు. పరమాత్మ గంధపు చెక్క ఆ మోస్తున్నది గాడిద అంటే నీవే ఆ గంధపుచెక్కల సువాసనలను ఆ జంతువు  ఆఘ్రాణించగలదా?  ఇలాంటి ఉపమానాలు  ఒక కాళిదాసు, ఒక జాన్ మిల్టన్ కే సాధ్యం. వారికన్నా సుతిమెత్తగా సామాన్యునికి కూడా అర్థమయ్యే స్థితిలో చెప్పడం  ఒక్క వేమన కే సాధ్యం మరి ఎవరు పోలిక లేరు... రారు.

"తనదు నాత్మ యందు దైవంబు గలుగంగ
తీర్థయాత్రలకిల తిరుగు నరుడు  
గంధపుందునుకల గాడిద మోసినయట్లు..."


కామెంట్‌లు