అమ్మ ప్రేమ;-గుండాల నరేంద్ర బాబు9493235992
పల్లవి:
అమ్మపాలు అమృతం
అమ్మమేలు శాశ్వతం 
అమ్మ ప్రేమ అనంతం
అమ్మ సేవ సుకృతం
అమ్మ పాటే కోయిల
అమ్మ బాటే ఊయల

చరణం:1
అమ్మ మాటే మధురం
అమ్మ  ఉంటే బెదరం
అమ్మ ఉంటే సుందరం
అమ్మ వెంటే అందరం 
అమ్మ మమత మిన్నురా
అమ్మ సమత మన్నురా

చరణం:2
అమ్మ చూపు వెన్నెలా
అమ్మ రూపు కోవెలా
అమ్మ కీర్తి ఆకాశం
అమ్మ స్ఫూర్తి ప్రకాశం
అమ్మ మనసు వెన్నరా
అమ్మ మనసు జున్నురా

చరణం:3
అమ్మ జన్మ ధన్యము
అమ్మ పుణ్య తీర్థము
అమ్మ కన్న స్వర్గము
అవనిలోన ఎరుగము
అమ్మ కన్న దైవము
సృష్టిలోన చూడము

  

కామెంట్‌లు