రెండు నిమిషములు.. దైవ ధ్యానము "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌శ్రీమ న్మహేశ్వరుని
చంద్ర మౌళిని, శివుని
       ధ్యానమ్ము చేయండి!
శంకర ప్రియు లార!! (1)
👌అనుదినము భక్తితో
రెండు నిమిషము లైన
      ధ్యానమ్ము చేయండి!
శంకర ప్రియు లార! (2)
          ( శంకర ప్రియ పదాలు., శివశ్రీ శంకర ప్రియ.,)
👌ఒకరోజుకు.. ఇరువది నాలుగు గంటలు! గంటకు.. అరువది నిమిషములు! కనుక, 1,440 నిమిషములు..  ఒక అహోరాత్రము! అనగా, పగలు రాత్రి కలిపి, ఒక దినము! ఇందులో.. కనీసం "రెండు నిమిషముల సమయ మందు. ఇష్టదైవమైన, పరమేశ్వరుని ధ్యానించండి!" అని, కంచి పరమాచార్యులు పేర్కొను చున్నారు!
 👌"భక్త మహాశయు లార! మీరందరూ నావద్దకు అనేక కానుకలు తీసుకుని వస్తున్నారు. పుష్ప ఫలాదులు తెస్తున్నారు. ధనము నిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరడం లేదు. "దినానికి రెండు నిమిషాలు మాత్రమే నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు నిశ్చలమైన భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి!" అదియే .. నాకు అత్యంత ప్రీతికరమైన కానుక!" అని వివరించారు, శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారు!
👌"సాధకులార! మీరు దినమంతా లౌకిక వ్యాపారాలతో కాలం గడుపుతారు.  దినములో.. "రెండు నిమిషాలు..  ఈ బీద సన్యాసికి దానమివ్వ లేరా? నాకు కావలసినది అంతే!".
అని, సందేశ మిచ్చారు!
👌గృహస్థులమైన మనమంతా.. లౌకిక  జీవనములో, దైనందిన వ్యవహారములలో.. తలమునకలై; క్షణము తీరిక లేకుండా జీవించు చున్నాము! కనుక, ప్రతీరోజు.. కనీసం రెండు నిమిషములైన.. పరమేశ్వరుని త్రికరముల శుద్ధిగా ధ్యానించడం వలన; భక్తిప్రపత్తులతో.. భగవంతుని అర్చామూర్తులను పూజించడం వలన.. శాంతి దాంతులతో, భోగ భాగ్యములతో..   మనుగడ  కొనసాగించు చున్నాము! తద్వారా, సచ్చిదానంద మయము, శ్రీకైవల్య పదమగు పరమేశ్వరుని సాన్నిధ్యము పొందుచున్నాము! 
     ఇదియే.. శ్రీస్వామివారి ఆకాంక్ష! శుభం భూయాత్!
⚜️ పంచచామరం వృత్తం ⚜️
      
    నమోస్తు తే! సదా శివా!  సనాతనా! నమోస్తు తే!
     నిమేషమంది నీల కంఠ!  నీ కృపా కటాక్షముల్
      ప్రమోదమందఁ జేయు, ప్రభావపూర్ణ తేజమై
      నమస్కరింతు నయ్య! నీకు నన్నుఁ గాంచుమా! శివా!
        ( శ్రీ శివాష్టోత్తర శత పంచచామరావళి "చిత్రకవి సమ్రాట్" శ్రీ చింతా రామకృష్ణా రావు.,)

కామెంట్‌లు