స్వాతంత్య్ర దీప్తులు"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 🙏స్వాతంత్య్ర దీప్తులను
వెలిగించిన ధీరుడు!
      మన "ఆది శంకరుడు"!
శంకర ప్రియులార!(1)
🙏సకల మానవాళిని
జాగృత మొనరించిన
    అద్వైత భాస్కరుడు!
శంకర ప్రియులార!(2)
      (శంకరప్రియ పదాలు., శంకరప్రియ.,)
👌"స్వాతంత్ర్య ము" అనగా స్వేచ్ఛతో కూడిన జీవనము! అది.. ధర్మబద్ధ మైన, శాంతియుత మైన జీవితము! స్వాత్మ తత్వ జ్ఞానమును పెంపొందించు కోవడమే.. "స్వాతంత్ర్యము"! అది కోల్పోవడమే.. పారతంత్య్రము!
👌కులము, వర్గము, ప్రాంతము.. మున్నగు, విబేధాలతో; అనైక్యత గా నుండడం వలన, సుసంపన్నమైన మన భారతదేశమును విదేశీయులు పరిపాలించారు!  పిమ్మట, అందరూ సమైక్యతగా నిలబడి  స్వాతంత్ర్య మహా సంగ్రామములో పోరాడి, విజయం సాధించారు, మన భారతీయులు!
👌జగద్గురు ఆదిశంకరులు.. "పరమేశ్వరుడు ఒక్కడే!" అని; "ఈ ప్రపంచ మంతా, ఆ పరమేశ్వరుని స్వరూపము" అని; "మనమంతా స్వేచ్ఛా యుతమైన జీవులము" అని; తత్వజ్ఞానమును ప్రజలందరికీ ప్రభోధించారు! 
👌ఆ విధముగా.. మన భారతీయులలో స్వాతంత్ర్య దీప్తులను వెలిగించాడు! అట్లే, పారతంత్య్ర చీకట్లను పారద్రోలిన శంకరుడు.. అద్వైత జ్ఞాన భాస్కరుడు!
    జగద్గురువు లైన ఆదిశంకరులు నుండి.. కంచి పరమాచార్యుల వరకు.. ఆచార్య శ్రేష్ఠులందరూ.. స్వేచ్ఛాయుత పరిపాలనకు కారకులైనారు! కనుక, అందరిలో.. దేశభక్తికి, దైవభక్తికి.. మూల కారకులై నారు, జగద్గురు ఆది శంకరాచార్యులు!
⚜️పద్య రత్నములు⚜️
      🚩చంపక మాల:
    కులముల నెంచ బోక, తమ  గుండెల పంచముడన్న  మాటతో,
      చెలిమిని గూర్చి సర్వజన  చేతన తత్త్వము భారతీయమై
      గలగల పారు శ్లోకము లగర్వము గల్గెడు సంప్రదాయమున్
      నిలిపిన శంకరార్యు డిల నేస్తము స్వేచ్ఛను కోరె లోకమున్!
    🚩ఉత్పల మాల🚩
దేహము కోవెలై, నరుడు దివ్యవిహారిగ వేల్పు జీవుడై,
       మోహము లేక కర్మలను మోక్షము మాత్రమే ధర్మసూత్రమై
      దాహము లేని హంస వరదాతగ శంకరబోధ లందునన్
        స్నేహము మానవత్వమున స్వేచ్ఛను నింపెను భారతావనిన్
(  అవధాని, శ్రీమాడుగుల నారాయణ మూర్తి.)

కామెంట్‌లు