సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నిజాలు...నైజాలు...
  ******
మన చుట్టూ ఉన్న వాళ్ళని నిశితంగా పరిశీలిస్తే చాలా చాలా నిజాలు, వాళ్ళ లోపలి నైజాలు బయట పడతాయి.
సమయం ,సందర్భం వచ్చినప్పుడు అసలు నైజం బయట పడి "ఔరా! ఆ వ్యక్తి లోపల మనకు తెలియని మరో కోణం కూడా ఉందా!" అని ఆశ్చర్యం కలగక మానదు.
ఇక కొందరి నైజం అయితే మేడిపండు నిగనిగల చందమే... లోపలంతా కుళ్ళుతనపు లుకలుకల వ్యవహారమే.
తెలుసుకున్న ఈ నిజాల వల్ల ఆయా వ్యక్తుల  నైజం పట్ల గౌరవం పెరగడమో లేదంటే అంతకు ముందు ఉన్న  అపారమైన విశ్వాసం నిలువునా కుప్పకూలి పోవడమో జరుగుతుంది.
ద్విముఖ నైజం ఉన్న వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిత్వానికి, మనసుకు హాని కలిగేంత వరకు అలాంటి వారిని గుర్తించలేం.
కానీ మన సన్నిహితులకు జరిగిన సంఘటనలు, వాళ్ళు పొందిన అనుభవాలను  బట్టి గ్రహిస్తే మంచిది.వారి బాధాకర అనుభవాలే,మనం జాగ్రత్తగా ఉండేందుకు ఉపయోగపడే పాఠాలు . 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు