:చెప్పులు లేకుండా వెళ్తున్న విద్యార్థితో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ;-వెంకట్ మొలక ప్రతినిధి వికారాబాద్ జిల్లా


 బురదలో చెప్పులు పాడైతాయని వేసుకోలేదని,ఇంట్లో చెప్పులు ఉన్నాయి అనటంతో,వేసుకోకపోతే కాళ్ళు పాడైతాయని విద్యార్థికి సూచించారు.వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పాఠశాల వదలటంతో విద్యార్థులు అంతా రోడ్డు పక్కన నుండి నడుస్తూ వస్తుండగా,తాండూరు లో కార్యక్రమాలు ముగించుకొని నగరానికి వెళ్తున్న మంత్రికి ఒక విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్తుండటం  గమనించి చలించిపోయి కార్ అపి ఆ విద్యార్థిని చేరదీసారు.ఇంట్లో చెప్పులు ఉన్నాయని తెలుసుకొని ప్రతి రోజు పాఠశాలకు వేసుకొని వెళ్లాలని సూచించారు. అనంతరం ఆ విద్యార్థితో పాటు అందరికి డిక్షనరీలు అందించారు.బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు
కామెంట్‌లు