సుప్రభాత కవిత ;-బృంద
మబ్బుల ముసిముసినవ్వుల
అందమైన చిత్రం..

నీటి అద్దంలో మురిపంగా చూస్తూ
మురిసిపోయే వైనం

నీలమంత నింగి కిచ్చిన నీటి
ప్రేమకు గుండె నిండి అక్కడే
ఉండిపోయిన  మబ్బులు.

లోకానికి మోము చూపకుండా
దాచేసి సూరీడితో
దోబూచులాడే మబ్బులు

నీటిలో మబ్బుల నవ్వుల
వెలుగులు.....
నింగిని మెరిసే
చుక్కలను మించిపోయె జిలుగులు

నింగికి నేలకూ 
నేలమీది నీటికీ ఈ బంధం
ఈనాటిదా??

ఒకరులేక ఒకరు లేరు
ఒకరితోనే మరియొకరు
విడదీయని అనుబంధం.
 
ఆశలు  చిగురించే నిరీక్షణ 
ఫలించే ఉదయం

ఆనందం వెల్లి విరిసే 
ఆగమనం.

అందమైన ప్రకృతిని ఆనందమయం
చేసే ఉదయం.

సంతోషం  నిండిన  హృదయం  పలికే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు