బాలలు మాట్లాడితే
సెలయేరు పెదవి విప్పినట్లు
వెన్నెల మాట్లాడినట్లు
పుప్పొడి పలకరించినట్లు
వల్లకి నినదించినట్లు
మలయమారుతం ధ్వనించినట్లు
బాలలు మాట్లాడితే
అక్షరాల రేకులతో
పదాల పుప్పొడితో
భావాల పరిమళంతో
కావ్యపుష్పం వికసించినట్లు
బాలలు మాట్లాడితే
ప్రశ్నల ఆకుల్నీ
జవాబుల పువ్వుల్నీ
తామే పూస్తున్న
కావ్య లతలైనట్లు
ఈ బాలలంతా
హేమంతాన్నీ వసంతాన్నీ
కలిపి అంటుకడితే
అలవోకగా పుట్టిన
అపురూపమైన మొక్కల్లా
ఆ దిగంతాల నుండి
నడిచి వచ్చిన
అల్లరి వల్లరులైనట్లు
ఈ బాలలందరూ
వసివాడని అద్భుతాలు సుమా !!
అద్భుతాలు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి