ఒక పక్షికి
తన ఆహారం ఎక్కడ దొరుకుతుందో
తెలియదు
తన గూడు ఎక్కడుంటుందో
తెలియదు
గమ్యం లక్ష్యం గందరగోళం
కానీ ఎగురుకుంటూ పోతుంది ఎక్కడికో!!?
అలా ఎగిరింది
తొలి త్రివర్ణ పతాకం!!?
చిట్టి చీమకు
కనీస అవసరాలు లేవు
ఆయుష్షు లేదు విశ్రాంతి లేదు
కోట్ల సంవత్సరాలు గా
మనతో కలిసి తిరుగుతుంది
కలిసి పుడుతుంది!!
అలా పుట్టింది
స్వాతంత్ర గతం
వందేమాతర గీతం!!?
పెత్తనం పేరిట
కత్తి కాలు దువ్వింది
చులకన చేయబడ్డ విత్తనం
ఒక కొత్త మొలకనిచ్చింది
కత్తిది సాయుధ పోరాటమైతే
మొలక మౌనంగా మహావృక్షమై ఎదిగింది!!
రక్తపాతాన్ని పచ్చని బాపు
బంగాళాఖాతం ఆపింది!!?
పంజరంలో చిలకా
సీతాకోచిలక
జీవిత చరిత్రను చదివింది!!
పోగొట్టుకునేది ప్రాణం కాదు
ఎక్కు పెట్టాల్సింది బాణం అని తెలుసుకుంది!!!
ఆయుధం కాదు
అహింసా యుద్ధమే అనివార్యమైంది
సీతాకోచిలక
ఎర్రకోటపై ఎగిరింది!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి