సుప్రభాత కవిత ; -బృంద
గుండెలోని గాయమేదో
గురుతుకొచ్చి 

మనసుపొరలలోని చెమ్మ
కనుల చిమ్మి

తెలియకనే మనసంతా
తలపులతో బరువై

మరలిరాని క్షణాలకై
మతిమాలిన ఎదురుచూపు.

తరగని గనిగా 
మదినిండిన తలపులు

మాయని మమతల
సుడిగుండంలో ....

బయటకు రాలేక
లోపల  ఆగక ఉబికే ఊటలా

కరిగిన మనసున
నిలిచిన బింబం 

కంటికి పండుగ తెచ్చే
రూపున 
ముంగిట నిలిచే క్షణాలకై

గుండె బరువై...కనులు మసకై
చీకటి తోసుకు వచ్చే వెలుతురుకోసం

వేయికనులతో వేచిన
మనసుకు ఊరటనిచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు