వేద ధామం; -డాక్టర్ కందేపి రాణిప్రసాద్
వేద ధామం మన భారత దేశం
శాంతి పథం మన భారత దేశం
పుణ్య క్షేత్రం మన భారత దేశం
పవిత్ర దేశం మన భారత దేశం

స్వరాజ్య సిద్ధి కై పోరాడి
సంకెళ్లు తెగ్గొట్టిన నేల
స్వతంత్ర భారత స్థాపన లో
సర్వమత సమ్మిలిత నేల

ఒకేమాట,ఒకే బాణ మని
రాముడు పాలించిన నేల
అహింసా, శాంతి లే ముద్దని
గాంధీ ఉద్యమించిన నేల

నీరు, ఏరు, చెట్టు- పుట్ట
అన్నిటినీ పూజించిన నేల
జీవహింస వద్దన్న బుద్దుడు
జంతువులను కొలిచిన నేల
గ్రహ గమనాలను లెక్కగట్టి
గణితం కనుగొన్న నేల
ప్రకృతి లోనే ఔ షధ ముందని
పరిశీలించి చెప్పిన నేల.

కామెంట్‌లు