బడి గంట;- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
బడిలోని గంట
గణగణ మ్రోగింది
వేళకు రమ్మని
హెచ్చరించింది

బద్దకం వదిలి
బడికి రమ్మంది
క్రమశిక్షణతో
జీవించమంది

బాలలను చూసి
స్వాగతించింది
తల్లి మనసుతో
పొంగిపోయింది

శ్రద్ధగా చదివి
పేరు తెమ్మంది
బుద్ధిగా మసలి
ఎదిగి పొమ్మంది

బడితో బంధం
ముడివేసుకుంది
పిల్లలతో గంట
కలిసిపోయింది

పిల్లలు పోతే
ఏకాకి అయింది
మరుసటి రోజుకై
ఎదురు చూస్తుంది


కామెంట్‌లు