బందీ ....!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ.
 అతడినోరు 
మూసుకు పొయింది ,
అతడిప్పుడు 
నోరుకదపలేడు
మెదపలేడు...
నోటుకు--
బానిస అయినాడు
ప్రశ్నించే స్వేచ్చకు 
తనకుతానే 
దూరమైనాడు !
బీదరికాన్ని 
జయించడానికి బదులు 
తాత్కాలిక తాయిలాల
మోజులోపడ్డాడు  ,
ఎండిన డొక్కలతో 
దిక్కుతోచక -
తిరుగుతున్నాడు ,
అతడికిప్పుడు 
మాట్లాడేచాన్సులేదు!
మనసువిప్పి----
బాధనువెళ్లబోసుకునే 
వెసులుబాటు లేదు ...!
అతడిప్పుడు -
ఓటును-నోటుకు
అమ్ముకున్నవాడు,
నాయకుడి చేతిలో
స్వేఛ్ఛకోల్పోయిన
ఒకబందీ ....!!
             ***

కామెంట్‌లు