శబ్ద సంస్కృతి! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 సురాధ్వజ్  అనేది ప్రాచీన కాలంలో ఓపద్ధతి!సురాపానం అంటే మద్యం సేవించేవారికి ఓశిక్ష విధించేవారు. వారి మస్తకంపై మద్య పాత్ర చిహ్నం ని (ఇనుపముద్ర) ని కాల్చి అద్దేవారు.ఆమచ్చ అలా ఉండిపోతుంది పచ్చబొట్టు (నేటి టాటూ)లాగా!అంటే మద్యపానం నాలుగు పాతకాలలో ఒకటి  అని రాజు విధించే శిక్ష అది!
సూబా అనేది ఫారశీ పదం! దాని మూలార్ధం గోధుమల రాశి అని! కాలాంతరంలో ప్రాంతం  ప్రదేశం కి వాడటం మొదలైంది. తొలిసారి అక్బర్ తనరాజ్యాన్ని  సూబాలుగా విభజించాడు అంటే నేటి రాష్ట్రాలు అని  మనం అంటున్నాం.సూబా అంటే300-400మైళ్ళ పొడవు 100-200మైళ్ళ వెడల్పు  ఉండే ప్రాంతం అన్న మాట! దీని అధికారి సూబేదార్! మరాఠీలో సుభేదార్ గా మారింది. సైనిక అధికారిని సుబేదార్ అని నేడుకూడా మనం పదప్రయోగం చేస్తున్నాము🌹
కామెంట్‌లు