పర్వతాల పేటలో పుట్టిన గిడుగు
విజయనగరంలో చదివిన పిడుగు
అధ్యాపకుడిగా వెలుగు
వ్యవహార భాషోద్యమకారుడు
గ్రాంధిక భాష రాజ్య మేలుతున్న వేళలో
మధురమైన మాతృభాష
వాడుక భాషకు
ధ్వజమెత్తిన గిడుగు
తెలుగు భాషకు గొడుగు
భాష అందరి సంపద
కావ్యమైన కవిత్వమైన వ్యవహారిక భాషలో ఉండాలని
చేతి వ్రాతకు నోటి మాటకు పొంతన ఉండాలని
పండిత పామరుల సైతం అర్థం చేసుకోవాలని చాటిన ధీరోదాత్తుడు
సవర భాషకు వ్యాకరణము గూర్చిన సరస్వతీ పుత్రుడు
బహుభాషా కోవిదుడు
తెలుగు వ్యవహారిక భాష ఉద్యమానికి
మూలపురుషుడు సంఘసంస్కర్త
తెలుగుకు పట్టం కట్టిన వెలుగుల రేడు
తెలుగు కావ్యాలను తేనె లొలికించి
ప్రజా వాణిలో పలుకునట్టు చేసిన
యుగపురుషుడు
నిగర్వి నిస్వార్థ సేవకుడు
ఆధునిక భాషా సంస్కరణలచే నవ్య సాహితీ పరిషత్తు వారి కైజర్ ఈ హింద్ బిరుదు గ్రహీత
కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి