పల్లె మిత్రుడు ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు /బాసర.
కోడి పుంజుమనకు కూరిమిన్  కూతతో 
తెల్ల వారినదని తెలియజేయు 
రాజకీయపావు  రణమున బలినొందు 
కత్తి గట్టి చంపు కక్షలవియె !

బాల చంద్రుడకట పలనాటి పౌరుష
భావనలను గూర్చి భగ్గుమనగ 
బ్రహ్మనాయునింట బ్రతుకును తృణమయ్యె 
శత్రు వర్గమునకు శాంతిలేక !


కామెంట్‌లు