ఆరోజు టీచర్ పాఠం చెబుతూ "మనం ఎప్పుడూ పాజిటివ్ అంటే సకారాత్మక భావాల్ని కలిగి ఉండాలి "అంది."భావం అంటే?" ఆరోక్లాస్ పిల్లలు అరిచారు."ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు?""నేను పాఠం గురించి...నేను మాఅమ్మ కి వంట్లో బాగా లేదు.ఎలా ఉందో అని!..బడి విడిచిపెట్టేటైంకి వర్షం వస్తుందేమో అని!" ఇలా తలా ఓమాట చెప్పారు. టీచర్ ఇలాఅంది"సరే! నేను సంఘటనలు చెప్తాను. దాన్ని ఊహించుకోండి. ఇద్దరు బాటసారులు నడుచుకుంటూ బస్తీకి బైలుదేరారు.ఓ ఐదుమైళ్లు నడిచాక చద్దిమూట తిని నీరుతాగి ఆపెద్దచెట్టు కింద కునుకు తీశారు. నిద్రపోయిలేచి "అరే! ఇంతపెద్ద చెట్టు ఉంది. శుద్ధ దండగ! ఒక్క కాయ పండు కనీసం పువ్వు కూడా లేదు " అని మాట్లాడే వారిని చూసి చెట్టు నిరాశగా నిట్టూర్పు విడిచింది."హు!ఎంత స్వార్థం కుటిలభావాలు వీరివి!నానీడలో హాయిగా నిద్రపోయి నాగురించి ఎంత తక్కువ గా నీచంగా ఆలోచిస్తున్నారు? పాపం!ఆజామ మామిడి చింత చెట్లకు ఎప్పుడూ రాళ్ళ దెబ్బలే!"అని సంతోషంగా ఉంది. కాసేపటికి ఓబండిపై ఇద్దరు వచ్చారు.కాసేపు ఆచెట్టు నీడలో పడుకున్నారు.అందులో ఒకడన్నాడు" అన్నా! మనం కట్టెలు బొగ్గు కొంటానికి పట్నం బైలుదేరాంకదా? ఈచెట్టు కొమ్మలు నరికేద్దాం.చాలా పెద్దగా ఉంది కదా!బోలెడంత కట్టెలమోపులు చేయొచ్చు. వీటిని కాలిస్తే బొగ్గు వస్తుంది. ఈచెట్టుని కొట్టేసినా ఎవరూ మనల్ని అడగరు! అని ఆఇద్దరు కల్సి దాని కొమ్మలు నరికి బండెడు కట్టెలతో ఇల్లు చేరారు. మోడుగామారిన ఆచెట్టు మనిషి స్వార్థం కుత్సితభావాలు తల్చుకుంటూ కన్నీరు కార్చింది. "
శివా అన్నాడు "ఆ!టీచర్!ఇప్పుడు నాకు అర్ధం ఐంది.మాఅమ్మ ఓకథ చెప్పింది.అద్దాన్ని చూసి రాయి ఫక్కున నవ్వింది "నేను సైజులో నీకన్నా చిన్నదాన్ని! కానీ నిన్ను పగులకొడ్తే ముక్కలు ముక్కలు అయి ఎందుకూ పనికిరావు.పైగా మనిషి కి గుచ్చుకుని అపకారం చేస్తావు."దానికి అద్దం పాజిటివ్ గా ఏంచెప్పిందోతెలుసా?"నేను ముక్కలు ఐనా తమ మొహాలు ఆచిన్న చిన్న గాజుముక్కల్లో కనపడటం చూసి మనుషులు సంతోషిస్తారు. ఇదే సకారాత్మక పాజిటివ్ భావం కదూ టీచర్?"
"గుడ్!ఇదే భావం అంటే!చెడులోకూడా మంచి జరుగుతుంది అనే ఆశాభావంతో మనం ఉండాలి. యద్భావం తద్భవతి అన్నారందుకే!"టీచర్ మాటకి అంతా ఔనంటూ తలూపారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి