సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
  కీర్తి.. స్ఫూర్తి
     *****
 మన సమాజంలో కొందరు కీర్తి కోసం పాకులాడే వారు, మరి కొందరు  సమాజ శ్రేయస్సుకు పరితపించే స్ఫూర్తి దాతలు ఉంటారు.
స్ఫూర్తి దాతల మనసెప్పుడూ సమాజ హితం, సాటి వారి ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ, వారి సేవలో సదా మునిగి పోతూ ఉంటుంది.
కీర్తి కోసం తపించే వారు తమనను, తాము చేసే పనులను మెచ్చుకుని, తమ గొప్పదనాన్ని గురించి బాగా అందరూ పొగడాలని ఆశపడుతూ ఉంటారు.
 వారు చేసేదంతా కేవలం పేరు కీర్తి ప్రతిష్టల కోసమేనని అర్థం చేసుకోవచ్చు.
  ఇతరుల అభివృద్ధి కోసం,వారి శ్రేయస్సు కోసం తపిస్తూ దాన ధర్మాలు చేసేవారు కొందరు ఉంటారు.  వాళ్ళు చేసే మంచి పనులు ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడరు.ఎవరైనా ఆ విషయమై ప్రశంసిస్తే ,అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు ఓ చిన్న చిరునవ్వుతో ఆ విషయం దాట వేస్తారు. అదీ వాళ్ళ హృదయౌన్నత్యం.
కీర్తి కోసం కాకుండా ఇలాంటి హృదయ ఔన్నత్యం  కల వారినే స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు