రాజయ్యకి గొప్ప చింత పట్టుకుంది. పోయిన ఏడు మిర్చి ధర కొండెక్కి తోటిరైతులు కొంత లాభం చూసారు. అది చూసి ఈ సారి తను కూడా నాణ్యమైన విత్తనాలు తెచ్చుకోని వేసాడు. గాలి, నీళ్ళు అనుకూలంగా ఉండి మిరపపళ్ళు మాణిక్యంలా మెరుస్తూ చేను కళకళ లాడిపోయింది. కళ్ళం దగ్గరికి వచ్చి దళారీలు బేరం పెట్టినా.., నేను నేరుగా ప్రభుత్వం యార్డ్ దగ్గరికి పోతాను అనేశాడు. వాళ్ళ నక్క జిత్తులకి లొంగకుండా... ఇప్పుడు ఇంక మిర్చి మొత్తం బాగా ఎండినన్ని రోజులు గుండెల్లో భయం.. ఏ రాత్రి సరిగా నిద్ర లేదు.. గాలి కొడితే వానొస్తాదేమో అని భయం. ఎటువంటి బాధ లేకుండా మిర్చి నాణ్యం గా ఉందని తోటి వాళ్ళ భరోసా తో బాడుగ ట్రాక్టర్ లో తరలింపు చేస్తున్నాడు.. అంతలో ముంచుకొచ్చింది నిద్ర... డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న వాడల్లా, ఆపేసి దిగి వెనక్కెళ్ళి హాయిగా ఆ కారం ఘాటు లోనే తుమ్ముకుంటు పడుకొని ఆదమరచి నిద్ర పోయాడు..
ఒకటే కలలు.. ఇంటిదాని నగలు కుదువ విడిపించినట్టూ,వరలక్ష్మి వ్రతం చేసి,
పెద్ద పిల్లకి పెళ్లి చేసి నట్టు, పిల్లాడిని ఇంజనీర్ గా చేసినట్టు.. !
ట్రాక్టర్ కుదుపులు కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాలా అన్నట్టుగా ఉంది. దళారీ ల నుండి తప్పించుకున్నా, యార్డ్ దగ్గర తూకాలు, కిరి కిరి చూసి బిత్తరపోతున్నపుడు.. అల్లుడు వరస పిల్లోడిని కల్సి మొర పెట్టుకున్నాడు.అతను గోపి. చదువు కునే టపుడు రాజయ్య వాళ్ళ ఇంట్లో రెండేళ్లు ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి బాగా తెలుసు.
అతను వచ్చి దగ్గరనే ఉండి మంచి రేటుకి అమ్మించి డబ్బులు జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు..ఖర్చు లు పోనూ బాగా లాభం వచ్చింది. ఈ ఏడు గట్టెక్కడంతో అంతా మిర్చి లక్ష్మి కాదు కాదు వరలక్ష్మి దేవి దయ అనుకున్నాడు రాజయ్య !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి