సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఆత్మీయ లోగిలి... ఆనందాల జాబిలి
*******
 మన మనసు ఆత్మీయ లోగిలి కావాలి.
 అలాంటప్పుడే మనం అభిమానించే వారు, మనల్ని గౌరవించేవారు, ప్రేమించే వాళ్ళు  ఎలాంటి సంశయం లేకుండా స్వంత ఇంటికి వచ్చినంత  సంతోషంగా, మన మనసు లోగిలి లోకి అడుగు పెడతారు.
 కష్టాలను సుఖాలను కలబోసుకుంటారు.మన ఆవేదనలో ఆనందంలో వెన్నంటి ఉంటారు.
 ఆ విధంగా ఆహ్లాదకరమైన భావనలతో, మానవతా విలువలతో కూడిన అంతరంగాన్ని ఆవిష్కరించే విధంగా, మనసు లోగిలిని  ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి.
 అప్పుడే పుచ్చపువ్వులా మెరిసే ఆనందాల జాబిలై ఆప్యాయతల వెన్నెల్లో విహరింప జేస్తుంది. మలయ మారుతమై ఎదుటి హృదయాలను హత్తుకుంటుంది.
ఎల్లప్పుడూ మనసు లోగిలి   సంతోషాల జాబిలి ఐతే ఆనందాలకు కొదవే ఉండదు. అనారోగ్యానికి తావే ఉండదు.

 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు