వడ్రంగి పిట్ట ;- ఎం. వి. ఉమాదేవి
తెలివిగల్లదోయ్ వడ్రంగి పిట్టా 
పురుగులకోసం బెరడుని తట్టా 
బైటకి వస్తే నిండును పొట్టా 
ఉలిలా ఉండు ముక్కునిపెట్టా 
రంధ్రము చేసేఉపాయమిట్టా.. ఉమ !

ఎండిన చెట్టును చూస్తుంది 
చాలానే రంధ్రాలు వేస్తుంది 
తొర్రలో తిండిని దోస్తుంది 
శీతాకాలానికి  దాస్తోంది 
పండ్లూగింజలేస్తుంది..ఉమ !

కామెంట్‌లు