@ జీవితానుభవం @ కోరాడ నరసింహా రావు
జాతీయ వృద్ధుల దినోత్సవం 
   ==================
జీవితం వృద్దాప్యం వరకూ వచ్చిందంటే అనుభవాలతో పరిపూర్ణంగా పండిపోయిందన్న మాటే... !

 మనకోసం మన తల్లి,దండ్రులు చూపించినప్రేమాభిమానాలు...మనల్ని ప్రయోజకులుగా తీర్చి దిద్దటంకోసంవారుపడ్డశ్రమ,దమాదులు...మనకు తెలియకుం డానే  బాల్యం గడిచిపోతుంది !

కష్టం-సుఖం...బరువు,బాధ్యత 
ఇవేవీతెలుసుకునేతీరికనివ్వదు
యవ్వనం.... !

 పిల్లలమీద మమకారం,వాళ్ళ నుపెంచటంలో పడ్డ శ్రమను ... 
తెలియనివ్వదు... !

వయసు ఉడిగి...దేహం వడలి  
ఆసక్తత తో మనసు కన్నబిడ్డల సహకారాన్నికోరుకుంటున్నప్పుడే...కోరుకున్నప్రేమాభిమానాలుపొందలేనపుడే...గతానుభవాలన్నీ జ్ఞప్తికివచ్చిజీవితసారం బోధపడి...చేసినపొరపాట్లకు పశ్చాత్తాపము మొదలౌతుంది!

అంతవరకూ... అంతగా పట్టిం చుకోని భార్యాభర్త లిరువురూ 
ఒకరివిలువనొకరు తెలుసుకుని 
ఒకరికికొరి పైన నిజమైన ప్రేమ పుడుతుంది !, ఆప్యాయతానురాగాలుపెరుగు తాయి...,ఒకరిచేయి ఒకరు వీడక శేషజీవితాన్ని కలిసి గడిపుతూ...నిజమైనదాంపత్య జీవన మాధుర్యాన్ని అనుభవి స్తూ...మనసు పెడుతున్నవేదన
నంతా మరచిపోతారు... !
ఇదికదా... పరిపూర్ణ జీవితాను భవం   !!
     ********

కామెంట్‌లు