వరలక్ష్మి దేవి;- సుమ కైకాల

 లక్ష్మీదేవి స్థితికారకురాలు
ఆమె చూపు పడితే చాలు
పట్టిందల్లా బంగారమే!...
ఆమె కరుణాకటాక్షం కోసం
తపించనివారు లేరు...
ఆమె అనుగ్రహం కోసం
ఉపాసించనివారు లేరు...
అంతటి మహిమగల దేవత వరలక్ష్మి
వ్రతాలు అనేవి  పవిత్రంగా
నిలవాలనే సందేశాన్ని అందిస్తాయి...
జీవితం వ్యర్థకాలయాపన కోసం కాదని
అనుక్షణం సద్భావనలతో
సదాశయాలతో సంప్రదాయ పరిరక్షణతో
గడపాలని తెలిపే గుణాలకు నిలయాలు వ్రతాలు...
వాటిని భక్తితో ఆచరిస్తే ఆనందాలు
పుష్కలంగా లభిస్తాయి🙏
కామెంట్‌లు