జీవితం లో... ఓటమిలతోనే
వంటబడుతుంది వేదాంతం!
అది వంటబట్టినాక... విజయాలలోనూ కనిపించేది ఉదాసీనం... !!
*******
@ అందుకే... !@
@@@@@
కష్టాలొచ్చినపుడల్లా దేవుడ్ని తలచుకుని దుఃక్కిస్తాడు వాడు
అందుకే... వాడ్ని కష్టాలు వదలవు !
సుఖం కలిగిన ప్రతిసారీ... తనపై ఆ దేవునికున్న దయను
తలచికృతజ్ఞతాభివందనములు
సమర్పించుకుంటాడు వీడు
అందుకే..వీడ్ని సుఖాలువీడవు.
******
@ వీడని కష్టాలు @
@@@@@@
చేసిన పాపాలు పోవటానికి...
ఎన్నెన్ని పూజలు చేసాడు !
ఐనా ఇన్నిన్ని కష్టాలా... !?
పాపాలు చెయ్యటం ఆపలేదుగా.... !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి