గోరు ముద్దలు ;-ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
==============
పప్పునెయ్యి కమ్మని  ముద్దలు 
అమ్మ చేత తినిపించే ముద్దలు 
పెద్దగిన్నెలో కలిపే ముద్దలు 
శుద్ధo ఊడ్చేసే ముద్దలు !
అలిగేము ఆఖరుముద్దకి ఉమ!

ఆవకాయతో ఆహా ముద్దలు 
ఆనందం లాగించే ముద్దలు 
గోంగూరపచ్చడి గుటుక్కుముద్దలు 
పప్పుచారుతో పాపల ముద్దలు 
పెరుగునిమ్మకాయ్ పెద్దముద్దలు ఉమ!

చారన్నం వడియాల ముద్దలు 
వేడన్నంలో వెన్నల ముద్దలు 
చద్దన్నంతో మాగాయ్ ముద్దలు 
పులుసన్నంలో పల్లీల ముద్దలు 
వద్దనకుండా మింగేముద్దలు ఉమ!

బాదం చెట్టుకింద బలేబువ్వలు 
గుండ్రంగ కూర్చునితినే గువ్వలు 
అత్తయ్య ఆపేక్షతోటి నవ్వులు 
పిల్లలందరికి నచ్చే బువ్వలు 
బాల్యంతోటన పూసేపువ్వులు ఉమ !

కామెంట్‌లు