జెండా ఎగరేద్దాము
రండి బాలలూ !
పండుగ చేద్దాము
పదండి బాలలూ!!
" జెండా ఎగరేద్దాము "
వందే మాతరమంటూ...
వందనాలు చేద్దాము!
జన, గణ,మనయంటూ...మన
గొంతులుకలిపేద్దాము !!
"జెండా ఎగరేద్దాము... "
స్వాతంత్య్రం కోసం...
ఉద్యమాలుచేసిన...
మనతాతలను స్మరిద్దాము!
దేశమాత కోసం...
తమప్రాణాలను అర్పించిన
మన వీరులను తలుద్దాం!!
" జెండా ఎగరేద్దాము... "
స్వాతంత్య్రం వచ్చీ...
అమృ తోత్సవాలు చేస్తున్నా
దేశంలో సుఖ, శాంతులు
లేవన్నది విన్నవిస్తు....,
" జెండా ఎగరేద్దాము.... "
రేపటి పౌరులు మేమని ..
దేశరక్షణకై నిలిచెదమని...
సుఖ, శాంతులు దేశంలో...
మేమే నెలకొల్పెదమని...
ప్రతిజ్ఞనే చేస్తూ.......,
" జెండా ఎగరేద్దాము..... "
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి