ఆ ఇద్దరూ ఇద్దరే!;-- యామిజాల జగదీశ్
 2014 నవంబరు 13వ తేదీక ప్రత్యేకమే ఆ ఇద్దరికీ....ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా...అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల దినోత్సవ కార్యక్రమంలో కలుసుకుని ఫోటోలకు పోజిచ్చారు. పొడగరి పేరు సుల్తాన్ కోసెన్. పొట్టి మనిషి పేరు చంద్ర బహదూర్ డాంగి. ఈ సందర్భంగా చంద్ర బహదూర్ మాట్లాడుతూ ఎత్తయిన మనిషిని ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తామిద్దరం కలుసుకోవడం మరచిపోలేని సంఘటన అని చెప్పుకున్నాడు.
2014 నాటికి బతికున్న వారిలో అత్యంత ఎత్తయిన వ్యక్తిగా సుల్తాన్ కోసెన్ గిన్నిస్ రికార్డులకెక్కాడు. ఇతను టర్కీకి చెందిన కోసెన్ ఓ రైతు. అతని ఎత్తు 8 అడుగుల 2 అంగుళాలు. ఇంకా అతను ఎత్తు ఎదుగుతూనే ఉన్నట్టు గిన్నిస్ సంస్థ కనుగొంది.
1982 డిసెంబర్ 10వ తేదీన జన్మించిన కోసెన్ ఇంట అతని తోబుట్టువులు కానీ తల్లిదండ్రులుకానీ సగటు పరిమాణంలోనే ఉన్నారు. సాధారణ ఎదుగుదల అనేది కోసెన్ విషయంలోనే జరిగిందని కుటుంబసభ్యులు తెలీపారు. అతని ఎదుగుదలకు ముఖ్య కారణం "పిట్యూటరీ జిగాంటిజం". మెదడులోని పిట్యూటరీ గ్రంధి నుండి "గ్రోత్ హార్మోన్" విడుదల అవుతుంది; 
ఈ విపరీతమైన పరిమాణం కారణంగా, సుల్తాన్ పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయాడు. పైగా తన కుటుంబాన్ని పోషించడానికి అతను ఒక రైతుగా పని చేయడం ప్రారంభించాడు. అలాగే మరికొన్ని చిన్న చిన్న పనులూ చేస్తూ వచ్చాడు. ఎత్తులో ఉన్న ప్రతికూలతల విషయానికొస్తే, అతను సరిపోయే బట్టలు లేదా బూట్లు కొనుక్కోవడం కష్టతరంగా ఉండేది. ఎత్తువల్ల బాస్కెట్ బాల్ ఆడాలనుకుని ఓ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు కానీ మరీ ఎత్తుగా ఉన్నాడని ఎంపికవలేదు.
అయినప్పటికీ, అతనికి బాస్కెట బాల్ క్రీడంటే మహా ఇష్టం. 
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుటలకెక్కినప్పుడు అతను మాట్లాడుతూ "నేనీ రికార్డుల పుస్తకానికెక్కుతానని అస్సలు ఊహిఉచలేదని,  కాని దాని గురించి కలలు కన్నానని, అయితే తన పేరు ఇందులో నమోదవడం ఎంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందన్నాడు. 2010 ఆగస్టులో అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పిట్యూటరీ గ్రంధిని ప్రభావితం చేసే కణితిపై శస్త్రచికిత్స చేసి మరింత ఎత్తు ఎదగకుండా చేసింది. 2013లో అతని పెళ్ళయింది. ఆమె పేరు  మెర్వ్ డిబో. అతని కంటే తొమ్మిదేళ్లు చిన్నది. ఆమె ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. వారిద్దరినీ కలిపింది ఓ సన్నిహిత మిత్రుడు. వీరి వివాహానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధితోపాటు వందల మంది హాజరయ్యారు. మరియు స్థానిక ప్రముఖులు ఉన్నారు.
ఇక ఈ ఎత్తయిన మనిషిని కలిసిన పొట్టి మనిషి చంద్ర బహదూర్ డాంగీ నేపాల్ దేశస్థుడు. ఇతను 1939 నవంబర్ 30న నేపాల్‌లోని కలిమతిలో జన్మించారు. తన 75 వ ఏట 2015 సెప్టెంబర్ మూడో తేదీన మరణించాడు. అతను న్యుమోనియాతో బాధపడ్డాడు. ఇతని ఎత్తు ఒక్క అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇతను 2012లో అత్యంత పొట్టి వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. లండన్లో ఎత్తయిన
సుల్తాన్ కోసెన్ ను కలిసిన రోజునే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళయిన జ్యోతి ఆమ్గేను కూడా కలవడం విశేషం. ఆమె భారతీయురాలు. బాలీవుడ్ నటి. ఆమె ఎత్తు 2011 డిసెంబర్ 16 నాటికి 24.7 అంగుళాలు.






కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం