బాబూ, పాపా రారండీ...
గుర్రపు స్వారీ చేసొద్దాం !
రెక్కలగుర్రం ఎక్కేద్దాం...
చుక్కల లోకల్ చూసొద్దాం !
రాజుల గుర్రం ఎక్కేద్దాం....
రాజ్యాలన్నీ తిరిగొద్దాం !
రేసులగుర్రం ఎక్కేద్దాం...
జాక్ పాట్ నే కొట్టేద్దాం !
గుర్రపు జట్కా ఎక్కేద్దాం...
ఊరంతా తిరిగొద్దాం !
సైనిక గుర్రం ఎక్కేద్దాం...
జెండాతో కవాతు చేసేద్దాం !
అందాకా కర్రగుర్రం ఎక్కేద్దాం
ముందుకు, వెనుకకు ఊగేద్దాం
బాబూ, పాపా రారండీ...
గుర్రపు స్వారీ చేసేద్దాం... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి