*శ్రీమతి డబుర ధనలక్ష్మి* కలల సౌధానికి నిచ్చెన వేసెయ్;-*డా. చిటికెన కిరణ్ కుమార్*
==సమీక్ష... లక్ష్యోదయం 

             ============

🌸కష్టాల సమ్మెట పోటులు తగలని
పుటం పెట్టిన బంగారం లా
ధగధగ మెరిసే రోజు ఒకటి 
నీకై ఉందనే సత్యాన్ని గ్రహించు 

నిందల నిప్పులు దహించినా
కన్నుల కన్నీటి చెలమ ఇంక నివ్వక
కాలం కత్తులు దూసి కించ పరచినా
సమయం కాదని మౌనం వహించు

వెరవక లక్ష్యం కోసం శ్రమించు
విరానమెరుగాని కష్టం ఇష్టంగా మార్చుకో
వెన్నంటి ఉండి వెన్నుతట్టే స్నేహమాధుర్యాన్ని 
నమ్మిన వ్యక్తులతో ఇచ్చిపుచ్చుకో

విశాల గగనపు జీవితాన
అవకాశాల చుక్కలకు
ప్రయత్న దారాన్ని కట్టి 
వెన్నెల వెలుగుల లక్ష్యం చేరుకో

మనసున మల్లెలు కురిపించే
ప్రేమలు మది గదిలో పదిల పరచుకో
మోయలేని..మోసపు బంధాల బరువును
బాధ్యతల ప్రయాణం లో వదిలించుకో

అహాన్ని వీడి భుజాన్ని కలుపుకో
కించపరిచే భావాలను వెలివేసి
ఉత్సాహ పరిచే ప్రయత్నాలను
పరిపూర్ణ మనసుతో స్వాగతించు

నిరంతరం శ్రమతో ..అకుంఠిత దీక్ష తో
ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించి
జీవితాన్ని సంతోషాల ఇంద్రధనుస్సు గా మార్చి
కలల సౌధానికి నిచ్చెన వేసెయ్

                         🌸
=====================
                         🌸


🌸లక్ష్యోదయం🌸
===========

🌸జనియించినావు వో సాధకుడా... నీవే కార్య దీక్షుడవై....

రేపటికై ఒక రోజు నీకు కేటాయించబడింది అని మరిచిపోకు..! నరమంటూ  లేని నాలుక వేసే నిందలకు  రక్తం కన్నీళ్లులా నిన్ని బాధించినా..,
 వెనుదురుగక సాగిపో, నిన్ను వెన్ను తట్టీ ప్రోత్సహించే స్నేహాన్ని మరువకు, ఆకాశమంత ఎత్తు ఉన్న  నీ లక్ష్యం  చేరే అడ్డంకులను విడవకుమా.... అవకాశవాదులు ఎంత నిన్ను మోసం చేసినా, నిరోత్సాహపరిచే ప్రయత్నాలను మరిచిపో....!
 రేపటి ఇంద్రధనస్సుపై శిలా శాసనమై లిఖించే నీ విజయం కోసం



కామెంట్‌లు