పాకెట్ మనీ!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈరోజుల్లో ప్రతి అమ్మా నాన్న లు పిల్లలకు పాకెట్ మనీ అని ఇస్తున్నారు. దాన్ని వారు తమకిడ్డీ బ్యాంకులో వేస్తారు. ఇంకొందరు అది నిండాక బ్యాంక్ లో తమపేర ఎకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇంకొందరు పిల్లలు తమకి కావల్సిన వస్తువులు  కొంటారు.ఈతరం పిల్లలకు పాకెట్ మనీ ఉంది. అలాగే ఒకప్పుడు విదేశాల్లో గొప్ప వారు  తమపిల్లలకి డబ్బు ఇచ్చేవారు. 
ఫ్రాన్సులో  ఇద్దరు అన్నాచెల్లెళ్లు చిలోపొలో అంటూ ఆడుతున్నారు. ఓబీదపిల్ల నెత్తిపై పళ్ళబుట్టతో అమ్మాలని బయలుదేరింది.ఆడుతున్న చెల్లెలు పరుగులు పెడ్తూ ఆపిల్లను ఢీకొట్టడం  పళ్ళ బుట్టతో సహా ఆఅమ్మాయి కింద పడటంతో పండ్లన్నీ దొర్లిపోయాయి.మట్టి అంటుకుని చితికిపోయాయి కూడా! ఆపిల్ల భోరున ఏడ్వసాగింది."ఆమ్మాయ్!ఏడ్వకు.ఇదిగో నాదగ్గర ఉన్న మూడు వెండి నాణాలు తీసుకో"అని ఇచ్చాడు."ఇది మాఅమ్మ నాకు ఇచ్చిన పాకెట్ మనీ "అన్నాడు"మాఇంటికి నాతో రా! మిగతా డబ్బులు మాఅమ్మ చేత ఇప్పిస్తాను". అతని చెల్లెలు అంది" అన్నా!అమ్మ కోప్పడ్తుంది.మనకింక పాకెట్ మనీ ఇవ్వదు." అన్న ఏమన్నాడో తెలుసా?"చెల్లీ!మనవల్ల ఆపిల్ల చాలా నష్టపోయింది.కష్టపడి పళ్ళు అమ్ముకుంటూ తనని తాను పోషించుకోవడమే గాక కుటుంబానికి ఆసరాగా ఉంది. మనం దేవుని దయవల్ల డబ్బు సుఖసంతోషాలకి లోటులేని కుటుంబం లో పుట్టాము.అమ్మ నన్ను తిట్టినా పాకెట్ మనీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. "అని ఆఅమ్మాయి ని తన తల్లి దగ్గరికి తీసుకుని వెళ్లి జరిగింది చెప్పి నష్టపరిహారం చెల్లించాడు."అమ్మా!మాఇద్దరికీ కొన్నాళ్ళు దాకా పాకెట్ మనీ ఇవ్వకు.ఈఅమ్మాయికి డబ్బు ఇచ్చి పంపు." ఆతల్లి కొడుకు నీతి ధర్మబుద్దికి మెచ్చుకుంది.ఆఅబ్బాయి ఎవరో తెలుసా? నెపోలియన్ చక్రవర్తి!ఫ్రాన్స్ సార్వభౌముడు!🌹
కామెంట్‌లు